కడప, ప్రభ న్యూస్: ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.13 లక్షల విలువ గల 271 గ్రాముల బంగారు ఆభరణాలు 100 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు- కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు, ప్రొద్దుటూరు వన్టౌన్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అనంతసాగర్ చెందిన షికారి కోటయ్య, షికారి శాలి అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి నట్లు తెలిపారు, వీరిపై గతంలో జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో 13 దొంగతనాల కేసుల్లో నిందితులు ఉన్నట్లు తెలిపారు, ఈ అంతర్రాష్ట్ర దొంగల పై పొద్దుటూరు టౌన్ పరిధిలో నాలుగు, పొద్దుటూరు టూ టౌన్ పరిధిలో 3, ప్రొద్దుటూరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 3, ఎర్రగుంట్ల పీఎస్ పరిధిలో ఒక కేసు,అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండు కేసులు, మొత్తం 13 కేసులు ఉన్నట్లు- తెలిపారు, దొంగలను అరెస్టు చేయడంలో కృషిచేసిన కడప టౌన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి , ఎస్ ఐ డాక్టర్ నాయక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ రికార్డులతో అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.