విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో: శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ఆయన మంగళవారం ట్విట్టర్లో స్పందించారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ.350 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఆ మొత్తం నిధుల్లో తాగునీటి సరఫరా పనులకు 25 శాతం వినియోగించుకొవచ్చునన్నారు.ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాల్లో నూరు శాతం నిధులు ప్రణాళిక ద్వారా వ్యయం చెయ్యవచ్చునని తెలిపారు.
అధికారం అంటే అజమాయిషీ కాదని… అధికారం అంటే ప్రజల మీద మమకారమని, ప్రజలందరి సంక్షేమం అన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతమని చెప్పారు. న్యాయంగా, అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం రూ. 137 కోట్లు- విడుదల చేసిందని చెప్పారు. అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం అని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారని గుర్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.