Monday, November 25, 2024

AP | ఏపీ డీజీపీ ట్విట్టర్​ అకౌంట్​ హ్యాక్​.. అసభ్యకరమైన ఫొటో  పోస్టు చేసిన హ్యాకర్లు!

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ట్విట్టర్ ఖాతా సోమవారం హ్యాక్ అయ్యింది. దానిపై హ్యాకర్లు అసభ్యకరమైన ఫొటోను పోస్ట్ చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఖాతా 2019లో క్రియేట్ అయ్యిందని, 2020 ఫిబ్రవరి నుంచి అది పనిచేయడం లేదని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.హెచ్.డి. రామకృష్ణ తెలిపారు. సోమవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఖాతాను హ్యాక్ చేశారని, దానిపై అభ్యంతరకరమైన ఫొటోను పోస్ట్ చేశారని తెలిపారు.

హ్యాక్ చేసిన పేజీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు హ్యాక్ చేసిన ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోను లైక్ చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసు శాఖలోని టెక్నికల్‌ విభాగం ఆ ఫొటోను పేజీ నుంచి తొలగించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement