బంగాళాఖాతంలో వాతావరణం సడెన్‌గా మారింది. ఒక్కసారిగా భారీ మేఘాలతో అల్పపీడనం లాంటిది పరుగులు పెడుతూ ఏపీవైపు వస్తోంది. ఆల్రెడీ ఇది తమిళనాడు దగ్గరకు వచ్చేసింది. ఇవాళ ఏపీకి వస్తుంది. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన ఉంది అని భారత వాతావరణ విభాగం చెప్పింది.
తాజా వాతావరణ బులిటెన్ ప్రకారం.. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ శ్రీలంక నుంచి బయలుదేరి.. పశ్టిమ మధ్య బంగాళాఖాతం గుండా పరుగులు పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతానికి వస్తోంది. దీని మేఘాలు ఆల్రెడీ ఏపీపైకి వచ్చేశాయి. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో 5 రోజులపాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి అనీ, అలాగే తమిళనాడు, కేరళలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయనీ, అలాగే జనవరి 8న ఏపీలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం బాగా ఉంది అని చెప్పింది. మరింత స్పష్టత కోసం శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలను చూస్తే, ఇవాళ తమిళనాడు తీరంలో ఆల్రెడీ వానలు పడుతున్నాయి. ఉదయం నుంచే రాయలసీమలో భారీ మేఘాలున్నాయి. ఇవి మధ్యాహ్నానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకూ విస్తరిస్తాయి.
ఉదయం 11 గంటల నుంచి తీర ప్రాంత తూర్పు రాయలసీమ, దక్షిణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇవి సాయంత్రం 6 గంటలవరకూ కొనసాగవచ్చు. మిగతా ప్రాంతాల్లో ఇవాళ మేఘాలు మాత్రమే ఉంటాయి. తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు పరుగెడుతూ ఉంటాయి. గాలిని గమనిస్తే, బంగాళాఖాతంలో ఇవాళ గంటకు మాగ్జిమం 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 17 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఐతే.. మనకు చల్లగా ఉన్న ఫీలింగ్ కలగదు. ఎందుకంటే మేఘాల వల్ల ఉక్కపోత అనేది ఉంటుంది. ఐతే.. చలికాలం కావడం వల్ల మరీ ఎక్కువ ఉక్కపోతగా కూడా అనిపించదు. మేఘాల వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. ఇవాళ తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రత మినిమం 18 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఏపీలో 20 డిగ్రీల సెల్సియస్ ఉంది. పగటివేళ తెలంగాణలో మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్, ఏపీలో మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇవాళ కోస్తా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కొంత వేడిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మిగతా తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఎండ ఇబ్బందిపెట్టదు.