Friday, November 22, 2024

Tuni – పవన్ తో ముద్రగడ కుమార్తె భేటి – వారి కుటుంబంలో చిచ్చు పెట్టలేనన్న జన సేనాని

తుని – కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తెను విడదీసే వ్యక్తిని కాదని అన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఆయనకు కుమార్తె ఉందన్న సంగతే తెలియదని అన్నారు. ముద్రగడ ఇంట్లో గొడవలు పెట్టాలనుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ముద్రగడను, ఆయన కుమార్తె క్రాంతిని మళ్లీ కలుపుతానన్నారు.

కాగా , తుని మీటింగ్ సమయంలో ముద్రగడ కుమార్తె, క్రాంతి, అల్లుడు పవన్ తో భేటి అయ్యారు. పార్టీ లో చేర్చుకోవలసిందిగా కోరారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు.

తనకు ముద్రగడ పద్మనాభంతో వ్యక్తిగత వైరం లేదని, ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టలేనని అన్నారు. నాన్న గారి అనుమతి పొందిన తర్వాత పార్టీలో చేర్చు కుంటానని క్రాంతికి పవన్ చెప్పారు. క్రాంతి కి ఒక సోదరుడు గా ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు పవన్ వచ్చే ఎన్నికల్లో ఆమెను జనసేన నుంచి నిలబెడతానని చెప్పారు.

- Advertisement -

ఇక తుని సభలో మాట్లాడుతూ, మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లు అంటూ సీఎం జగన్ పాలనపై సెటైర్లు వేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తులు పెట్టుకున్నామని ,కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని అన్నారు. తుని నుంచి విశాఖకు లోకల్ రైలు సదుపాయం కోసం కృషి చేస్తామని, విద్య, వైద్యం, ఉపాధి, సాగు, తాగునీరు, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా వస్తున్నామని, రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం చేస్తాం. కాలుష్య రహిత పరిశ్రమలు స్థాపిస్తాం. తుని నుంచి విశాఖకు లోకల్‌ రైలు సదుపాయం కల్పిస్తాం. తునిలోని వంద చెరువుల్లో వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మట్టి తవ్వేశారు. జర్నలిస్టులుపైనా దాడులు చేశారు. ఓ విలేకరిని చంపేశారు. అన్యాయానికి పాల్పడితే సహించేది లేదు. జర్నలిస్టులకు అండగా ఉంటాం. తుని మార్కెట్‌ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కోర్టులు చెబుతున్నా వినిపించుకోకుండా తాండవ నదిలో అక్రమ తవ్వకాలు జరిపి వైకాపా పెద్దలు ఇసుక అమ్ముకున్నారు. తునిలో హేచరీస్‌ పెట్టాలంటే రూ.10 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రూపాయి ఖర్చుకాకుండా హేచరీస్‌కు అనుమతిస్తాం” అని పవన్‌ భరోసా ఇచ్చారు.

కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖాయమైందని, మెజార్టీ కోసమే మనమంతా కలిసి పని చేయాలని పవన్‌ పిలుపునిచ్చారు.వైకాపా అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని, భవిష్యత్‌ అంతా మనదేనని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement