ఆంధ్ర.. కర్ణాటక.. తెలంగాణ ప్రాంతాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయం. జిల్లా పశ్చిమ ప్రాంత రైతులు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉండడంతో ఈ జలాశయం వరప్రదాయిగా మారింది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి రైతులు వేసుకున్న పంటలకు ఇబ్బంది లేకుంగా సాగునీరందిస్తూ సిరులు కురిపిస్తున్నది. అయితే తుంగభద్ర జలాశయం నిర్మాణం చేపట్టినప్పటి నుంచి డిసెంబర్‌లో జలాశయం నిండుకుండలా కనిపిస్తుండడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కర్ణాటక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువు పరిస్థితులు ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు తుంగభద్ర జలాశయం నిర్మాణం చేపట్టడం జరిగింది.
తుంగభద్ర జలాశయం 162 అడుగుల ఎత్తులో 8035 చదరపు అడుగులలో 1949వ సంవత్సరం నందు నిర్మాణ పనులు ప్రారంభించగా 1953 సంవత్సరం నందు తుంగభద్ర జలాశయం నిర్మాణ పనులు పూర్తి కావడం జరిగింది. జలాశయం పనులు పూర్తి అయినప్పటినుండి లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాల ప్రజలకు తాగునీరు అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తుంది. తుంగభద్ర జలాశయం నిర్మాణం చేపట్టినప్పటి నుండి డిసెంబర్‌లొ ఎన్నడూ లేనివిదంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుని నిండుకుండను తలపిస్తున్నది. ఈ ఏడాది రబీ సీజన్ సంబంధించి తుంగభద్ర జలాశయం పై ఆధారపడిన రైతులు మంచి పంటలు పండించుకోవ డానికి అవకాశం ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గాను 1632.95 అడుగులలో 100.855 టీ-ఎంసీల నీటి సామర్థ్యానికి గాను 100.663 టీ-ఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయనికి ఇన్‌ఫ్లోగా 3593 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా, అవుట్ ఫ్లోగా 5580 వేల క్యూసెక్కుల నీరు జలాశయం నుండి వివిధ కాలువలకు నిరు విడుదల కానున్నాయి. గతేడాది ఇదే సమయానికి జలాశయం నందు 1626 అడుగులలో 78.775 టీ-ఎంసీల నీరు నిల్వ ఉండేది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital