తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు నమోదు చేసుకొంది. 30 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో మే నెలలోనే జలాశయంలో దాదాపు 34టీఎంసీల నీటి నిల్వ నమోదు అయ్యింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 26,987 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 584 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1608.95 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలకు గాను, జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ దాదాపు 34 టీఎంసీలకు చేరింది.
ఎన్నడూ లేనంతగా తుంగభద్రకు భారీ వరద.. ఇది రికార్డే అంటున్న అధికారులు
Advertisement
తాజా వార్తలు
Advertisement