Saturday, November 23, 2024

Water Flow: తుంగభద్రకు జ‌ల‌క‌ళ‌.. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో!

కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : ఎగువ‌న కురుస్తున్న వాన‌ల‌తో తుంగభద్రకు భారీగా వ‌ర‌ద వ‌స్తోంది. కర్నాటకలో హోస్పేట్ డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువనున్న భద్ర, తుంగల‌కు చేరుతున్న ప్రవాహం తుంగభద్ర జలాశయానికి చేరుతోంది. రాత్రి 8 గంటలకు అందిన సమాచారం మేరకు తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గాను, ప్రస్తుతం 1622.50 అడుగులకు చేరుకుంది.

ఇదే సమయంలో ఎగువ నుంచి జలాశయానికి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో 100 .86 టీఎంసీల నిల్వలకు గాను ప్రస్తుతం 68.625 టిఎంసిల నీరు నిల్వ ఉంచారు. ఇక.. జలాశయం నుంచి కాల్వలకు 183 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరో రెండు రోజులపాటు డ్యాంకు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా డ్యాం నుంచి దిగువకు నీటిని వదిలే చాన్స్ ఉంద‌ని అధికారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement