ఆంధ్ర ప్రభ స్మార్ట్. కర్నూలు బ్యూరో : తుంగభద్ర డ్యామ్‌లో ఈనెల 10న కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ శనివారం రాత్రికి విజయవంతమైంది. విరిగిపోయిన గేటు వద్ద ఐదు ఎలిమెంట్లను అమర్చారు. దీంతో ఆ గేటు నుంచి దిగువకు వెళ్తున్న నీటికి అడ్డుకట్ట ప్రక్రియ విజయవంతం కావడంతో డ్యామ్ చెందిన గేట్లను మూసివేశారు.
.
దిగుగువకు నీటి వదిలే ప్రక్రియను నిలిపివేశారు.శుక్రవారం రాత్రి తొలి ఎలిమెంట్ ఎలిమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సాంకేతిక నిపుణులు శనివారం ఉదయం నుంచి పనులు మొదలుపెట్టి మధ్యాహ్నంకు మూడు ఎలిమెంట్ల అమ రికన్ పూర్తి చేశారు. ఇలా ఒక్కొక్కటిగా అమరుస్తూ రాత్రి 7 గంటలకు ఐదు ఎలిమెంట్లను పూర్తి చేయడంతో 19 గేటు నుంచి వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్టే వేశారు. మొత్తంగా ఐదు ఎలిమెంట్ల అమర్చి అందరినీ ఔరా అనిపించారు.
దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది. డ్యామ్ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో తాత్కాలిక గేటు ఏర్పాటు పనులు పూర్తవడం ఇంజనీర్ల పనితనానికి అద్దంగా నిలిచింది.