ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చితలు వాయిస్తూ సస్పెన్షన్ కి గురయిన సంగతి తెలిసిందే. టీడీపీ తీరుపై ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రవర్తన సరిగా లేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ పద్ధతి మార్చుకోకపోతే చిడతలు వాయించుకుంటూ, గోడలకు పిడకలు వేసుకోవడమే మీకు మిగులుతుందని ఎద్దేవా చేశారు.
కాగా, ఏపీ శాసనమండలి నుంచి ఎనిమిది మంది టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. గురువారం ఉయదం సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ ఆదోళనను కొనసాగించారు. మధ్యపాన నిషేధం, కల్తీసారాపై చర్చకు టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుపట్టారు. సభ్యులు ప్రభుత్వ భజన చేస్తున్నారంటూ మండలిలో తెలుగుదేశం నేతలు చిడతలు వాయించారు. టీడీపీ ఎమ్మెల్సీలు సభలో చిడతలు వాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేయాలని మంత్రి కన్నబాబు కోరారు. కన్నబాబు ప్రతిపాదనను మరో మంత్రి సిదిరి అప్పలరాజు బలపరిచారు. టీడీపీ సభ్యులు సభ గౌరవాన్ని, జౌన్నత్యాన్ని దెబ్బతీసి బిచ్చగాళ్ళలాగా వ్యవహరిస్తున్నారని మంత్రులు తెలిపారు. దీంతో టీడీపీ సభ్యులు బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, కేఈ ప్రభాకర్, రాజసింహులు, అంగర రామ్మెహన్, దువ్వారపు రామారావు, బీటెక్ రవిని మండలి ఛైర్మన్ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.