Tuesday, November 26, 2024

TTD – గుజ‌రాత్, చ‌త్తీస్ గ‌డ్ ల‌లో తిరుమ‌ల శ్రీవారి ఆల‌యాలు – వైవి సుబ్బారెడ్డి

ఒంటిమిట్టలో అన్నప్రసాద సముదాయ నిర్మాణం కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలో గుజరాత్ రాష్ర్టంలోని గాంధీనగర్, చత్తీస్ గడ్ లోని రాయపూర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ మీడియాకు తెలిపారు.మరోవైపు టీటీడీ పై కొంత మంది రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వైసీపీ పార్టీ.. పాలకమండలి దోపిడి చేస్తున్నారని చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సనాతన హిందు ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ కి వచ్చిన విరాళాలతో దేశవ్యాప్తంగా 2450 ఆలయాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. 275 పురాతన ఆలయాలను పున:రుద్దరణ చేస్తున్నామని.. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన విరాళాల వ్యయానికి సంబంధించిన వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పారదర్శకంగా పనిచేస్తూ ఉంటే రాజకీయ లబ్దికోసం ఆరోపణలు చేస్తున్న వారి పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మరోవైపు తిరుమలలో భధ్రతను కట్టుదిట్టం చేసేందుకు చర్యలు చేసుకుంటామని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలపై తరుచు విమానాలు వెళ్ళడం పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా కర్నూల్ జిల్లా యాగంటిలో కళ్యాణ మండపంలో నిర్మాణం కోసం రూ.2.4 కోట్లు కేటాయించినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో 4.15కోట్లతో అదనపు లడ్డు కౌంటర్లు నిర్మాణం.. 2.35 కోట్లతో హెచ్ వీసి ప్రాంతంలో ఉన్న 144 గదులు ఆధునీకరణ చేస్తామన్నారు. రూ.1.88 కోట్లతో జీఎంసీ, ఎస్ఎంసి ఉప విచారణ కార్యాలయాలు ఆధునీకరణ చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు …….

పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం కోసం రూ.3.5 కోట్లు
వేదిక్ యూనివర్శిటిలో స్టాప్ క్వార్టర్స్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు
టీటీడీలో కంప్యూటర్లు ఆధునీకరణ కోసం రూ.7.4 కోట్లు
టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు సెంటర్ ఏర్పాటుకు రూ.9.4 కోట్లు
స్వీమ్స్ హస్పిటల్స్ ఆధునీకరణ కోసం రూ.95 కోట్లు
తిరుమలలో ప్లాస్టిక్ బదులుగా స్టీల్ డస్ట్ బిన్స్ ఏర్పాటుకు రూ.3.1 కోట్లు
తిరుచానురు పద్మావతి అమ్మవారి పుష్కరిణిలో ఇత్తడి గ్రీల్స్ ఏర్పాటుకు రూ.6.5 కోట్లు
తిరుపతిలో రామానుజా సర్కిల్ నుంచి రేణిగుంట వైపు బిటి రోడ్డు నిర్మాణంకు రూ.5 కోట్లు
నగరి నియోజకవర్గం బుగ్గ గ్రామంలో కళ్యాణమండప నిర్మాణంకు రూ.2 కోట్లు
కర్నూల్ జిల్లా ఆవుకు గ్రామంలో ఆలయ నిర్మాణంకు రూ.4 కోట్లు కేటాయింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement