తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..నేటి నుంచి శ్రీవారి సర్వ దర్శనాలు పున: ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ. ఇవాళ్టి నుంచి అలిపిరి వద్ద రోజు కి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అయితే, కరోనా విజృంభణ సమయంలో.. పూర్తిగా దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. ఆ తర్వాత క్రమంగా భక్తులకు కూడా అనుమతి ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్