Friday, September 20, 2024

TTD: జులైలోనూ శ్రీవారికి వంద కోట్ల ఆదాయం…

వ‌రుస‌గా 29వ నెల‌లోనూ వంద‌కోట్ల మార్క్ 3
గ‌త నెల‌లో ఏకంగా రూ.125 కోట్ల రాబ‌డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – తిరుమ‌ల వ‌డ్డీ కాసుల వాడికి రోజు రోజుకి ఆదాయం పెరిగిపోతున్న‌ది.. భ‌క్తుల స‌మ‌ర్పించే కానుక‌ల‌తో తిరుమ‌ల హుండీ నిండుగా పొంగిపొర్లుతున్న‌ది.. తాజాగా జులై నెలలో తిరుమలకు రికార్డు ఆదాయం వచ్చింది. 29వ సారి 100 కోట్లు దాటింది . తిరుమల శ్రీవారి హుండి ఆదాయం వరుసగా 29వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది. జులై నెలలో శ్రీవారికి హుండి ద్వారా 125 కోట్లు సమర్పించారు తిరుమల భక్తులు. ఈ ఏడాదిలో జూలై నెలలో వచ్చిన హుండి ఆదాయమే అత్యధికం కావడం విశేషం.

ఇది ఇలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 67916 మంది భక్తులు. అలాగే, తలనీలాలు సమర్పించిన 23010 మంది భక్తులుగా ఉన్నారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.93 కోట్లుగా నమోదు అయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement