తిరుమల అర్చకుల పునః నియామకంపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఏవి రమణదీక్షితులు స్పందించారు. 2018లో గత ప్రభుత్వం చట్ట విరోధంగా, రాజ్యాంగ విరుద్దంగా మిరాశీ అర్చకులను వయో పరిమితి పేరుతో రిటైర్మెంట్ చేసారని అన్నారు. అయితే ప్రస్తుతం సీఎం జగన్ మరల స్వామి వారి సేవచేసుకొనే మహత్భాగ్యాని కల్పించారు పేర్కొన్నారు. వంశపార్యపరంగా వస్తూన్న అర్చకుల హక్కులును గత ప్రభుత్వం రద్దు చెయ్యడంతో అర్చకులు చాలా నష్టపోయ్యారని…చాలా ఆలయాలు మూతపడ్డాయని..దేవతలకు ఆరాధన కరువైందన్నారు రమణ దీక్షితులు. అప్పటి ప్రభుత్వంలోని పాలకమండలి తీసుకున్న రెసెల్యూషన్ 50ని కోర్టు రద్దు చేసిందని…భగవంతుడు ధర్మాన్ని రక్షించినట్టుగా….అర్చకులు వంశపారంపర్య హక్కులను సీఎం జగన్ పరిరక్షిస్తూన్నారని అన్నారు. శ్రీవారిని, దేవాలయాలను., అర్చక కుటుంబాలను ఈ మధ్య రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్న ఆయన…రాజకీయాలకు తమకు సంబంధం లేదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement