తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్ సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అని ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in అని మార్చింది. తిరుమల శ్రీవారి పుణ్యకేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.
‘వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్’లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in ను ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్చామని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా అధికారిక వెబ్‌సైట్‌ను మార్చింది. ఇక నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని సూచించింది.
కొత్త వెబ్‌సైట్ ను ప్రారంభించిన భూమన …
ఇతర ప్రాంతాల్లో గల టీటీడీ స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించేదిశగా అన్ని వివరాలతో ఆధునీకరించిన వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ను తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్ ను ఆధునీకరించింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్, డిఎల్వో వీర్రాజు, సిఈ నాగేశ్వరరావు, ఐటి జనరల్ మేనేజర్ ఎల్ఎం.సందీప్ తదితరులు పాల్గొన్నారు.