తిరుమల : టీటీడీ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేమ్ బ్యాడ్జ్ ద్వారా భక్తులపై దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులను గుర్తించవచ్చని ఛైర్మన్ భావిస్తున్నారు.
నేమ్ బ్యాడ్జ్ లో పేరును గుర్తించి దురుసుగా ప్రవర్తించిన ఉద్యోగిపై భక్తులు ఫిర్యాదులు సులభంగా చేయవచ్చని ఈ కార్యక్రమానికి బీఆర్ నాయుడు శ్రీకారం చుడుతున్నారు. భక్తుల కంప్లైంట్ ఆధారంగా ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకొనే విధంగా ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ ఆదేశాలతో త్వరలోనే టీటీడీ ప్రతి ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వనుంది.
- Advertisement -