Friday, November 22, 2024

TTD | ఈఓగా బాధ్యతలు స్వీకరించిన జే.శ్యామలరావు

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈఓగా జే.శ్యామలరావు (ఆదివారం) బాధ్యతలు స్వీకరించారు. క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా వరాహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో గరుడ ఆళ్వార్ సన్నిధిలో ఈఓగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన శ్యామరావు దంపతులకు అర్చకులు వేదపండితులతో స్వాగతం పలికి ఆలయ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమీ తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ… తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కర్తవ్యాన్ని దైవంగా భావించి భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా సేవ చేస్తానన్నారు.

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి పారదర్శకంగా, బాధ్యతగా పనిచేస్తామని వెల్లడించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఎక్క‌డైనా సమస్యలుంటే బోర్డు దృష్టికి తీసుకురావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement