పర్యావరణ పరిరక్షణకు టీటీడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల కొండపైకి ఎలక్ట్రిక్ ట్యాక్సీలు నడపనున్నారు. ట్యాక్సీలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేలా కసరత్తు చేస్తున్నారు. బ్యాంకు ఒప్పందాల ద్వారా డ్రైవర్లకు సహకారం అందించనుంది. వాహనం కొంటే 15ఏళ్లు వినియోగించుకోవచ్చు. వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ కాబట్టి డైవర్లకు టీటీడీ సహకారం అందిస్తుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement