తిరుమల, ప్రభ న్యూస్ ప్రతినిధి : తిరుమల-తిరుపతి దేవస్థానం మూడవ పాలక మండలి సమావేశం ఈనెల 14 వ తేదీన తిరుమలలో జరగనుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు పది రోజుల పాటు తెరచివుంచే వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించడం, విఐపి దర్శనాలపై సమీక్షించనున్నారు. అలాగే రానున్న నాలుగు నెలల కాలానికి అవసరమైన ముడిసరుకులు, ఆహారపదార్ధాల కొనుగోళ్లకు ప్రాధాన్యతనిచ్చి చర్చించనున్నారు. కొన్ని మరమ్మతులకు నోచుకోని కాటేజి గదుల అభివృద్ధి పనులకు పై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement