Tuesday, November 19, 2024

శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు – టిటిడి

తిరుమల – శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే అన్నదానం, లడ్డూ ప్రసాదం తయారీకి కూడా సేంద్రీయ ఉత్పత్తులు వినియోగిస్తామని పేర్కొన్నారు.. తిరుమలలో నేడు సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణ‌యాల‌ను ఛైర్మ‌న్ మీడియాకు వెల్ల‌డిస్తూ, సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దాతల సాయంతో అందించిన పది లక్షల రూపాయలు వ్యయంతో బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణంకు రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రూ.14 కోట్లు కేటాయించేందుకు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజ్‌లో టీబీ విభాగం ఏర్పాటు చేసేందుకు 53.62 కోట్లు కేటాయిస్తామన్నారు. ఢిల్లీలోని ఆడిటోరియం అభివృద్ధి పనులకు 4 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలలో బోధనా సిబ్బంది నియామకానికి అంగీకరించినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు రూ.3.12 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement