Sunday, November 3, 2024

Tirumala : హోటళ్ళలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టీటీడీ ఈవో, పుడ్ సేప్టీ అధికారులు

తిరుమ‌ల : తిరుమలలోని హోటళ్ల‌లో టీటీడీ ఈవో జే శ్యామలరావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కౌస్తుభంలోని బాలాజీ రెస్ట్రారెంట్ లో భక్తులకు అందిస్తున్న ఆహారాన్ని, నాణ్యతను తనిఖీ చేశారు. నిల్వ ఉంచి పాడైపోయిన ఆహార పదార్థాలను ఈవో, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని ఆహారం, పాడైన పదార్థాలను భక్తులకు అందిస్తున్నట్లు తనిఖీల్లో తేటతెల్లమైంది.

తనిఖీల అనంతరం ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ… తిరుమలలో పెద్ద హోటళ్ళ కి టీటీడీ అనుమతి ఇచ్చిందని తెలిపిన ఆయన…. నాణ్యమైన ఆహారం అందించాల్సిన హోటళ్లలో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని స్పష్టం చేశారన్నారు. కౌస్తుభంలో ఉన్న బాలాజీ హోటల్లో ఆహారం దారుణంగా ఉందన్నారు. ఫుడ్ శాంపుల్స్ ను ల్యాబ్ కి పంపి పరీక్షలు నిర్వహిస్తున్నామని…రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకొంటామని తెలిపారు.

అనంతరం ఫుడ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ పూర్ణచంద్ర మాట్లాడుతూ…. పాడైపోయిన పదార్థాలను భక్తులకు అందిస్తున్నారని తెలిపారు. నిషేధంలో ఉన్న ఫుడ్ కలర్స్ ఆహారంలో వాడుతున్నారని స్పష్టం చేశారు. వంట తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పిన ఆయన పీడీఎస్ రైస్ వాడకూడదని తెలిసినా వాడుతున్నారన్నారు. ముందు రోజు మిగిలిన అన్నాన్ని కూడా నిల్వ ఉంచి మరుసటి రోజు వాడుతున్నారని నిర్ధారించారు. ఎఫ్ఎస్ఎస్ఏ చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. తిరుమలలో హోటళ్ల పై నిత్యం రైడ్స్ జరుగుతున్నాయని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. రిపోర్ట్ వచ్చాక హోటల్ ను మూసివేస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement