Tuesday, November 26, 2024

AP: ఆనం ఆరోపణలను ఖండించిన టీటీడీ ఈఓ.. బహిరంగ చర్చకు సిద్ధం

టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపణలపై ఈఓ దర్మారెడ్డి స్పందించారు. వెంకటరమణారెడ్డి ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్దమన్నారు. దేవాదాయశాఖ చట్టం మేరకు టీటీడీ ఈఓగా నియమితులవ్వాలంటే జిల్లా కలెక్టర్ లేదా సమాన హోదాలో పని చేసి వుండాలన్నారు. 1991 బ్యాచ్ కి చెందిన తాను ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కంటే ఎక్కువ హోదాలో వున్న పోస్టులో బాధ్యతలు నిర్వర్తించానన్నారు. తన నియామకంపై హైకోర్టులో పిల్ ధాఖలు చేస్తే దానిని హైకోర్టు కోట్టివేసిందన్నారు.

2014లో ఢిల్లీ కంటోన్మెంట్ డిఫైన్స్ సీఈఓగా వున్నప్పుడు అక్రమ కట్టడాలపై చట్టపరంగా చర్యలు తీసుకున్నాన్నారు. 2020లో వారు కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తే దానికి సంబంధించి సమన్లు గత ఏడాది జారీ చేశారన్నారు. సమన్లు స్వ్కాష్ చెయ్యాలని కోర్టులో కేసు వేస్తే దానిపై స్టే విధించారన్నారు. తాను టీటీడీలో అవినీతి చేసానని ఆరోపిస్తున్నారు.. తాను టీటీడీలో వచ్చిన గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఫిక్స్ డ్ డిఫాజిట్ల ద్వారా రూ.4800 కోట్లు, బంగారం 3885 కేజీల డిఫాజిట్లు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.1021 కోట్లు నిధులు జమ అయ్యిందన్నారు. దాతల సహకారంతో రూ.175 కోట్లతో చిన్నపిల్లల హస్పిటల్స్, రూ.135 కోట్లతో మ్యూజియం అభివృద్ది, రూ.274 కోట్లు స్విమ్స్ లో 1200 పడకల హస్పిటల్ గా అభివృద్ది పరుస్తున్నామన్నారు. రాజకీయాల కోసం నిజాయితీ అధికారులపై ఆరోపణలు చెయ్యడం మంచి సంప్రదాయం కాదన్నారు. తాను నిజాయితీ కలిగిన అధికారిగా గర్వంగా చెబుతానన్నారు. వెంకటరమణారెడ్డి సవాల్ విసురుతున్నా….తన పై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్దమని ఈఓ ధర్మారెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement