తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : తిరుపతి నగరంలో గత వారం పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి టీటీడీకి చెందిన ఒక మహిళా ఇంజనీర్ తో పాటు ముగ్గురిని పోలీసులు ఈరోజు అరెస్టు చేసారు. పోలీసుల కథనం మేరకు నగరంలోని ఎన్ జి ఓ కాలనీలో ఈనెల 25వ తేదీ ఉదయం బైక్ పై వెళ్తున్న వెంకట శివారెడ్డి (65)అనే వ్యక్తిపై ఇద్దరు బైక్ పై వచ్చి దాడి చేసి మొద్దు కత్తితో తలపై నరికారు. తీవ్రంగా గాయపడిన శివారెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితులను అరెస్టు చేసారు.
ఒకే అపార్టుమెంట్ లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి గిరీష్, ఆయన భార్య శ్రీలక్ష్మీ టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నది.. ఇదే అపార్ట్ మెంట్ లో నివశిస్తున్న శివారెడ్డికి, గీరిష్ దంపతులకు మధ్య గతంలో కొన్ని వివాదాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.. పాత కక్షల నేపథ్యంలో గిరీష్,లక్మీలు మరికొందరితో కలసి శివారెడ్డిన హత్య చేయించేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది.. దీంతో గిరీష్, లక్ష్మి లతో పాటు రమేష్, కేశవన్ అనే మరొ ఇద్దరిని అరెస్టు చేసినట్టు తిరుపతి డి ఎస్ పి రవిమనోహరా చారి తెలిపారు.