Thursday, January 9, 2025

TTD – తొక్కిసలాట దురదృష్టకరం – బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం – టిటిడి చైర్మన్

తిరుపతి. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దైవ దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని అన్నారు. ఓ డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారని.. దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు . బాధిత కుటుంబాలకు టీటీడీ అన్నివిధాల అండగా ఉంటామని చెప్పారు.

కాగా, తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారని.. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement