తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా టీవీ5 గౌరవ ఛైర్మన్ బీఆర్ నాయుడును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్‌గా కొనసాగనున్నారు.
టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల వ్యవస్థాపకులుగా హిందూధార్మిక కార్యక్రమాల నిర్వహణలో బీఆర్ నాయుడు తనదైన ముద్ర వేశారు. టీటీడీ ఛైర్మన్‌తో కలిపి మొత్తం 23 మంది సభ్యుల పేర్లతో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 24 మంది సభ్యులు ఉండగా.. వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున అవకాశం కల్పించారు. ఈసారి టీటీడీ పాలకమండలిలో సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడం విశేషం. కాగా, 24 మంది సభ్యులను ప్రకటించిన ఆంధ్రప్రభుత్వం.. మరొక సభ్యుడిని నియమించాల్సి ఉంది. బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నారు
వ్యాపారవేత్తగా..సామాజిక కార్యకర్తగా.. ఆధ్యాత్మికవేత్తగా సేవలు అందించిన బీఆర్ నాయుడుకు ప్రతిష్టాత్మకమైన టీటీడీ పదవిని అప్పగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తనను ఛైర్మన్‌గా నియమించినందుకు ఏపీ ప్రభుత్వానికి బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ నాయుడు.
బోర్డు సభ్యులు వీరే*
. సాంబశివరావు (జాస్తి శివ) శ్రీసదాశివరావు నన్నపనేని, ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే), పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి), మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, బురగపు ఆనందసాయి, సుచిత్ర ఎల్లా, నరేశ్‌కుమార్, డా.అదిత్ దేశాయ్ శ్రీసౌరబ్ హెచ్ బోరాకృష్ణమూర్తి, కోటేశ్వరరావు ,దర్శన్. ఆర్.ఎన్ , జస్టిస్ హెచ్‌ఎల్ దత్, శాంతారామ్, పి.రామ్మూర్తి, జానకీ దేవి తమ్మిశెట్టి , బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ