తిరుపతి సిటీ ప్రభ న్యూస్: గత దశాబ్ద కాలం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల్లోని ప్రజలు వేసవిలో తాగునీరు, సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిచేందుకు చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బృహత్ ప్రణాళికతో ఆవులపల్లె ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని.. ఎంతో హర్షించదగ్గ విషయమని టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ. ..అందుకు సహకరించాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటని పోకల అశోక్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం నుండి అన్ని అనుమతులతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, కేవలం కమీషన్ల కోసం కాదని కిషోర్‌కుమార్ గుర్తుపెట్టుకోవాలన్నారు.
గతంలో మీ అన్నగారైన అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అదోగతి పాలైందని, తన సొంత జిల్లా చిత్తూరు జిల్లా అభివృద్ధికి కూడా నోచుకోలేదని పోకల దుయ్యబట్టారు. అప్పట్లోనే ఎర్రచందనం దుంగలు మాయం చేశారని, ఆ నిందను పెద్దిరెడ్డిపై వేయడం హాస్యాస్పదం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కుడిభుజంగా ఉన్న పెద్దాయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేసే అభివృద్ధి పనులకు కిషోర్‌కుమార్‌రెడ్డి చేయూతనిచ్చి అభివృద్ధికి పాటుపడాలని అశోక్‌కుమార్ హితవుపలికారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రి పెద్దిరెడ్డిపై నీచ రాజకీయాలు చేస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రజలు తరిమి తరిమి కొడతారని నల్లారి కిషోర్‌కుమార్ గుర్తుపెట్టకోవాలని పోకల అశోక్‌కుమార్ ఆయనను హెచ్చరించారు. ఇప్పటికైనా నీచ దగజారుడు రాజకీయాలకు స్వస్తి పలికి, మంత్రి పెద్దిరెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్ అన్నారు.