Friday, September 6, 2024

TTD: అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి..

టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… దేవుని సన్నిధిలో సేవ చేసే భాగ్యం దక్కడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా స్వీకరించి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామ‌న్నారు.

సర్వదర్శనం మొదలుకొని… భక్తులకు ఎలాంటి అసౌకర్యం క‌ల‌గ‌కుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌న్నారు. ప్రతి విభాగంలో ఫీడ్ బ్యాక్ సిస్టంను అమలు చేస్తామ‌న్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించి… భక్తులకు ఏది బెస్ట్ అయితే దానిని అమలు చేసే ప్రయత్నం చేస్తామ‌న్నారు. మీడియా ఒపీనియన్ ను సైతం కన్సిడర్ చేస్తామ‌న్నారు.

టీటీడీకి అదనపు ఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కాగా.. డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

దీంతో ఈనెల 16న కేంద్రం ఆమోదం తెలుపగా.. ఆయన ఈ నెల 22న ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన్ను టీటీడీ అదనపు ఈవోగా నియమించడంతో పాటు తిరుమల జేఈవోగానూ విధులు నిర్వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకయ్య చౌదరి ఇవాళ‌ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

అభినందించిన తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు

ఆడిషనల్ ఈఓ బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరిని తిరుపతి అర్బన్ ఏస్పీ సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్బంగా ఆయనకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement