Friday, November 22, 2024

AP పై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డుకు TS సర్కార్ ఫిర్యాదు

ప్రాజెక్టులు, బ్యారేజీ పనులు చేపట్టవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.ఈ మేర‌కు కేఆర్ఎంబీ చైర్మ‌న్‌కు తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ రెండు లేఖ‌లు రాశారు. ప్ర‌కాశం బ్యారేజీ దిగువ‌న 2 ఆన‌కట్ట‌ల నిర్మాణ ప్ర‌తిపాద‌న‌పై అభ్యంత‌రం తెలిపింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమ‌తి లేకుండా ప్రాజెక్టులు చేప‌ట్ట‌రాద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ‌లో పేర్కొన్న‌ది.

2 కొత్త బ్యారేజీల ప‌నులు చేప‌ట్ట‌కుండా ఏపీని నిరోధించాల‌ని కోరింది. కృష్ణా జ‌లాల‌పై ఆధార‌ప‌డి పంప్డ్ స్టోరేజీ స్కీమ్‌ల ప్ర‌తిపాద‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో లేఖ రాసింది. అనుమ‌తి లేని పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌ల‌ను పరిశీలించాల‌ని కోరింది. సీడ‌బ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమ‌తి లేని వాటిని ప‌రిశీలించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం విన్న‌వించింది. జ‌ల‌విధానం మేర‌కు తాగునీటి అవ‌స‌రాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని తెలంగాణ కోరింది. తాగునీటి అవ‌స‌రాలు కాద‌ని ఇత‌ర‌త్రాల‌కు త‌ర‌లింపు స‌రికాద‌ని తెలిపింది. పంప్డ్ స్టోరేజీ స్కీమ్, విద్యుత్ ఉత్ప‌త్తికి నీటి త‌ర‌లింపు స‌రికాద‌ని పేర్కొన్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement