ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత వంగలపూడి అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని హోం మినిస్టర్ గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని… తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, హోంమంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ముఖ్యమంత్రికి ఆమే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిత వెంట అనిత కుమారుడు, కుమార్తె ఉన్నారు.
నిరాశ చెందకండి.. మీ సేవలను వినియోగించుకుంటాం..
చంద్రబాబు 4.0 క్యాబినెట్ లో కొత్తవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమ వంటి సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ఈ నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబును మంత్రి పదవులు దక్కని సీనియర్లు కలిశారు. ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు, యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబును కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర క్యాబినెట్ కూర్పు ఏ ప్రాతిపదికన చేశామో వారికి వివరించారు. మంత్రివర్గంలో స్థానం లభించలేదని నిరాశ చెందవద్దని, మంత్రి పదవులు దక్కని వారి సేవలను ఇతర రూపాల్లో వినియోగించుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
అటు, మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత తదితరులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రులుగా బాధ్యతతో పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు.