Tuesday, November 26, 2024

సీఎం జగన్ ను కలిసిన చినజీయర్‌ స్వామి

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను త్రిదండి చినజీయర్‌ స్వామి కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వనించారు. చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు సీఎం జగన్‌.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించన్నారు. కాగా, చినజీయర్‌ స్వామితో పాటు సీఎంని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు కలిసిన వారిలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement