Tuesday, November 26, 2024

ఘనంగా ఘంటసాల 47 వ వర్దంతి వేడుకలు..

కర్నూలు – సంగీతానికి అజరామరమైన సేవ చేసిన గానగంధర్వుడు, పద్మశ్రీ   ఘంటసాల గారి 47వ వర్ధంతి సందర్భంగా ఆయకార్ భవన్  వద్దగల ఆయన విగ్రహానికి పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి గౌరవాధ్యక్షులు, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘంటసాల   సినీ సంగీతానికి ఒక నూతన ఒరవడిని సృష్టించారని, సినిమా పాటలకు అత్యంత అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారని ఆయన కొనియాడారు ఇంకా మాట్లాడుతూ ఎన్నో అద్భుతమైన పాటలు పాడటమే కాకుండా సంగీత దర్శకత్వం కూడా వహించి బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఆయన పేరుగాంచారు అందువల్ల భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ బిరుదునిచ్చి గౌరవించింది అని తెలియజేశారు. అనంతరం శ్రీమతి సుధారాణి ఘంటసాల ఆలపించిన కొన్ని అద్భుతమైన గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాన కళా సమితి అధ్యక్షులు జగన్ గుప్తా, కార్యదర్శి కట్టా రాఘవేంద్ర ప్రసాద్, రాముడు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement