Wednesday, November 27, 2024

Tributes – వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కారణజన్ముడు – షర్మిల

వేంపల్లి సెప్టెంబర్ 2 ( ప్రభ న్యూస్) దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయ లోని వైయస్సార్ ఘాట్ వ‌ద్ద వై ఎస్ షర్మిల , డాక్టర్ తులసి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరితార్థుడు,చరిత్రకారుడు,కారణ జన్ముడు,రైతు పక్షపాతి,వ్యవసాయం దండుగ కారాదు,పండుగ కావాలని ఆశించినవాడు,అందుకే ఉచిత విద్యుత్,వ్యవసాయ రుణాల మాఫీ,విద్యుత్ బకాయిల మాఫీ,పంటల బీమా,ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాలు అమలు చేశార‌ని అన్నారు.

- Advertisement -

డాక్టర్ తులసి రెడ్డి మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పక్షపాతిని, అపర భగీరథుడు,తెలుగు గంగ,గాలేరు నగరి,హంద్రీ నీవా,వెలుగొండ, పోతిరెడ్డిపాడు,వెలిగల్లు తదితర సాగునీటి ప్రాజెక్టుల లో సింహభాగం పూర్తి చేసారు అన్నారు.
మహిళా పక్షపాతి,డాక్రా మహిళా సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని ,అభయహస్తం పథకాన్ని అమలు అన్నారు.
పేదల పక్షపాతి.అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు.అర్హులందరికీ ఫించన్లు ఇవ్వడం జరిగిందన్నారు. .ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా,ఒక సారి సీఎల్పీ లీడర్ గా,2 సార్లు పిసిసి అధ్యక్షులుగా,2 సార్లు ముఖ్య మంత్రి అయ్యారన్నారు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయం అన్నారు. ఆయన ఆదాయ సాధనకోసం అంకితం,పునరంకితం అవుదాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement