Tuesday, December 10, 2024

Tributes – అంబేద్క‌ర్ సేవ‌ల‌ను స్మరించుకున్న చంద్ర‌బాబు,జ‌గ‌న్

విశాఖ‌ప‌ట్నం .. అమ‌రావ‌తి – బాబా సాహేబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో జ‌రిగిన ఒక కార్యాల‌యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.

అలాగే బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు ఆజన్మాంతం పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడ‌ని అన్నారు. . భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించార‌ని ప్ర‌శంసించారు.. భావితరాలకు స్ఫూర్తి దాతగా నిలిచార‌న్నారు. దళిత జాతి తలెత్తుకుని గౌరవంగా నిలిచేలా చేసిన డాక్టర్ అంబేద్కర్ ప్రాత:స్మరణీయుడని అన్నారు.. ఆయన చూపిన బాటలో, చేసిన బాసతో నిరంతరంగా ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు…

జ‌గ‌న్ నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ వర్దంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు వరికూటి అశోక్‌బాబు, కాకుమాను రాజశేఖర్‌, కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement