Saturday, January 18, 2025

Tributes – ఎన్టీఆర్‌ వర్ధంతి – ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి, నారా కుటుంబాల ఘన నివాళి

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ , లక్ష్మీపార్వతి, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. ఇక మంత్రి నారా లోకేశ్‌, తల్లి భువనేశ్వరీ తదితరులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు.

 ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని చెప్పారు. పేదల‌ కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని అన్నారు. టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద నాన్నకు ఆసక్తి ఉండేది కాదని తెలిపారు. ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ ముందు.. ఆ తర్వాత అనే విధంగా తెలుగు రాజకీయాలు ఉన్నాయని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజల‌ వద్దకు పాలన తీసుకురావటానికి ఎన్టీఆర్ ఎన్నో‌ సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఇప్పటికీ ఎన్టీఆర్ పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. ఎన్టీఆర్‌ అంటే ఒక వర్సిటీ.. తెలుగుజాతికి మార్గదర్శకమని అని చెప్పారు. ఎన్టీఆర్‌ అంటే నటనకు నిర్వచనం.. నవరసాలకు అలంకారమని తెలిపారు. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారని ఉద్ఘాటించారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని బాలకృష్ణ ఉద్ఘాటించారు.వివిధ వర్గాల వారికి ఎన్టీఆర్ ధైవసమానమని అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారుచేసింది ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పారు. మద్రాసు నగరానికి మంచి నీళ్లు ఇచ్చిన‌ మహానుభావుడు ఎన్టీఆర్ అని నందమూరి బాలకృష్ణ కొనియడారు.

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, … ఎన్టీఆర్ ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం అని అన్నారు. ఎన్టీఆర్ ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం అని చెప్పారు. వెండితెరపై రారాజుగా వెలుగొందారని, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నినదించారని చెప్పారు. కోట్లాది మంది హృదయాల్లో కొలువైన తన తాతగానే తనకు నిత్యస్ఫూర్తి అని అన్నారు. 

- Advertisement -

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.

అలాగేబసవతారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌కు నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement