Monday, November 18, 2024

భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునళ్లు.. భూహక్కు, భూరక్ష పథకం సమీక్షలో జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: భూ వివాదాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో భూ వివాదాల పరిష్కారం కోసం టెబ్యునళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. జగనన్న భూ రక్ష, భూ హక్కు కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా టెబ్యునళ్లు కొనసాగాలని, అందుకోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వే సందర్భంగా కూడా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలని, మొబైల్‌ టెబ్యునల్‌ యూనిట్లు ఉండాలని స్పష్టం చేశారు. అందుకోసం దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు. ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు వల్ల న్యాయపరంగా దక్కే హక్కులను వీలైనంత త్వరగా పొందేందుకు వీలు ఉంటు-ందన్నారు. వివాదాల్లో ఉండి తరాల తరబడి హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు.

సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాల ఇలా అంశాల వారీగా గుర్తించాలని, సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలని సీఎం సూచనలు చేశారు. దీనివల్ల కొనుగోలుదార్లకు ఈ భూమి లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అన్నది తెలుస్తుందని, అదే సమయంలో ఆ వివాదాలను పరిష్కరించే ప్రయత్నం కూడా సమాంతరంగా జరగాలని, సర్వే ప్రక్రియలో నాణ్యత అనేది చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. వివాదాల పరిష్కారంలో కూడా అలాంటి క్వాలిటీతో కూడిన ప్రక్రియ ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ కూడా ఉండాలని, దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం చేకూరదని, తప్పులకు పాల్పడే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని, పక్షపాతం, వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటు-ందని, తద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుందని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement