విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో : అత్యంత ప్రమాదకరమైన హెప-టైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై సిఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వైఎస్‌ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ఆయన ఈ రోజు (ఆదివారం) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13 ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి వైద్యం అందిస్తుండగా, కొత్తగా మరో 18 వైద్య విధాన పరిషత్ ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో స్క్రీనింగ్, వైద్య సేవలకు సన్నాహాలు చేస్తోందని తెలిపారు.
ఈ ఏడాది తొమ్మిది లక్షల మందికి స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న ఆయన ఏప్రిల్ నుంచి దాదాపు రెండు లక్షల మందికి స్క్రీనింగ్ చేసినట్టు పేర్కోన్నారు. ఇప్పటి వరకు 1,500 మందికి హెపటైటిస్ బి,సి వున్నట్టు గుర్తించినట్టు తెలిపారు.