Friday, November 22, 2024

పారదర్శకంగా నూతన బార్‌ పాలసీ.. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి

అమరావతి, ఆంధ్రప్రభ : నూతన బార్‌ పాలసీలో అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా పాలసీని రూపొందించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి తెలిపారు. తనపై బురద జల్లాలనే దురుద్దేశంతోనే కల్పిత, ఊహా జనిత కథనాలను రాస్తున్నారన్నారు. గత 40 ఏళ్ల నుండి ఎంతో నీతి నిజాయితీతో రాజకీయాల్లో ఉన్నాననారు. నూతన బార్‌ పాలసీ అమల్లో పలు అవకతవకలు జరుగుచున్నాయని వార్తా కథనాలు వెలువడుచున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పందించారు. బార్‌ వ్యాపారస్తులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఉన్నట్లు- నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ విసిరారు.

నూతన బార్‌ పాలసీ అమల్లో భాగంగా ఇ-ఆక్షన్‌ విధానాన్ని అవలంబించడం జరుగుచున్నదన్నారు. ఇటువంటి బహిరంగ విధానం అమలు వల్ల ఔత్సాహికులంతా బహిరంగ వేలంలో పాల్గొనే అవకాశం ఏర్పడుచున్నదన్నారు. బార్‌ లైసెన్సుల వేలంకు సంబందించి ఆక్షన్‌ బిడ్డింగ్‌ సొమ్ము స్కీన్‌ పై అందరికీ ప్రస్పుటంగా కనిపిస్తుందని, దీని ప్రకారమే పోటీ-దారులు అందరూ ఈ వేలంలో పాల్గొని, బార్‌ లైసెన్సులను దక్కించుకోవడం జరిగిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement