Friday, November 22, 2024

Transfers Dispute – ఇంద్ర‌కీలాద్రిపై ఈవో, పాల‌క‌మండ‌లి ఛైర్మ‌న్ ల మ‌ధ్య లడాయి…

విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో పాల‌క‌మండ‌లి – అధికారుల మధ్య విభేధాలు మరోసారి బయటపడ్డాయి. దుర్గమ్మ శాకాంబరీ ఉత్సవాల వేళ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు వెలుగు చూశాయి. ఈవో భ్రమరాంబ తీరుపై చైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు

వివ‌రాల‌లోకి వెళితే. దుర్గగుడి అంతర్గత బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలోనూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి ఈవో బ్రమరాంబ బదిలీ చేశారు. ఈ బదలీల్లో భాగంగా చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు,‌ సిబ్బంది మార్పు జరిగింది. ఇద్దరు అటెండర్లకు గానా ఒక్క అటెండ‌ర్ ను మాత్రమే నియమించటంపై ఈవోపై చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో తీరుతో ఒక్క అటెండర్‌ను పేషీ నుంచి చైర్మన్ వెనక్కి పంపేశారు. కాగా, గతంలో కూడా ఈవో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఇటువంటి వ్యవహారాలు సరైనవి కావని అభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ కు చైర్మన్ కర్నాటి రాంబాబు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈవో ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement