Thursday, September 12, 2024

AP : ఏపీలో 19మంది ఐఏఎస్ , ఇద్దరు ఐపిఎస్ లు బదిలీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. వారితో పాటు ఇద్దరు ఐపిఎస్ లను కూడా బదిలీ చేశారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డిజిగా ఐపిఎస్ హరీష్ కుమార్ గుప్తా , హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఐపిఎస్ కుమార్ విశ్వజీత్ ను నియమించారు.. ఈ మేరకు ప్రభుత్వప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఎఎస్ అధికారులు .. పోస్టింగ్ వివరాలు

అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా అనంతరాము, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌గా రాం ప్రకాష్‌ సిసోడియాకు బాధ్యతలు అప్పగించారు. భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా జయలక్ష్మి, కన్నబాబుకు సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.

పూర్తి జాబితా ..

- Advertisement -

– భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా జయలక్ష్మీ.
– అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా అనంతరాము.
– రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కాంతీలాల్‌.
– ల్యాండ్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ సీఎస్‌గా రామ్‌ ప్రకాష్‌ సిసోడియా.
– పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శిగా సురేష్ కుమార్
– గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగింత
– ఐటీ శాఖ కార్యదర్శిగా శౌరబ్ గౌర్‌కి అదనపు బాధ్యతలు
– పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఎన్.యువరాజ్
– మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్థన్
– సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబు బదిలీ
– గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు
– క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్
– మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఏ సూర్యకుమారి
– పరిశ్రమలు శాఖ డైరెక్టర్‌గా సి. శ్రీధర్
– ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్
– పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా వి.విజయరామరాజు
– సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా
– వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఎస్.ఢిల్లీ రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement