Friday, November 22, 2024

Breaking: ఏపీలో 8మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్​ల బ‌దిలీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్​ అధికారుల బ‌దిలీ జ‌రిగింది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం నుంచి ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. బ‌దిలీ అయిన వారిలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులున్నారు. సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్‌రెడ్డిని నియమించారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్‌, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి.. తిరుమల తిరుపతి ఈవోగా కూడా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి కొనసాగుతారని ప్రభుత్వ ఉత్వర్వుల్లో పేర్కొంది.

ఇక.. సీసీఎల్‌ఏగా జి.సాయిప్రసాద్‌, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి.ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.విజయ్‌కుమార్‌, రవాణాశాఖ కమిషనర్‌గా ఎం.టి.కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్‌.. క్రీడలు, యువజనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్‌ భార్గవకు అదనపు బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా బాబు.ఎకు పూర్తి అదనపు బాధ్యతలు, ఐపీఎస్‌ అధికారి పి.సీతారామాంజనేయులుకు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి నుంచి రిలీవ్‌ కల్పించారు. ఆంధ్రప్రదేశ్​ డీజీపీతోపాటు ఏసీబీ డీజీగా కె. రాజేంద్రనాథ్​రెడ్డి వ్యవహరించనున్నారు, ఇంటెలిజెన్స్​ డీజీగా సీతారామాంజనేయులు, విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డీజీగా భారతికి బాధ్యతలు అప్పగించింది సర్కారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement