హైదరాబాద్ – మిచాంగ్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణపై కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో రెండు రోజుల పాటు ముందు జాగ్రత్తగా దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 151 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ముఖ్యంగా విజయవాడ – చెన్నై మార్గంలోని రైళ్లను రద్దు చేశారు.. అలాగే కాజీపేట మీదుగా విశాఖకు వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను లిమిటెడ్ హాల్ట్ గా నడపనున్నారు… ఇతర వివరాలకు ఇండియన్ రైల్వే వెబ్ సైట్ లో చూడాలని సూచించింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement