హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల పనుల నేపథ్యంలో .ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు .
28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా.. ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, గుంతకల్-బోధన్ రైలు సమయంలో తాత్కాలికంగా మార్పులు చేసినట్టు తెలిపారు.
23 ఎంఎంటీఎస్ రైళ్లు
దీంతో పాటు హైదరాబాద్ జంటనగరాల్లో ప్రజలకు సర్వీసులందించే 23 ఎంఎంటీఎస్ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.
- Advertisement -
Cancellation / Partial Cancellation / Rescheduling of Train @drmhyb @drmsecunderabad pic.twitter.com/KXdebBaGpq
— South Central Railway (@SCRailwayIndia) June 18, 2023