Sunday, November 17, 2024

Trains – నేడు మరో 20 రైళ్లు రద్దు …

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్లు నీటమునిగాయి..

మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను రద్దు చేసింది. మరో 160 రైళ్లను దారిమళ్లించింది.

మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో హౌరా-బెంగళూరు, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్- త్రివేండ్రం, హాతియా-బెంగళూరు, ఎర్నాకులం-హాతియా, జైపూర్-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్బాద్-కోయంబత్తూరు రైళ్లను రద్దుచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement