Friday, November 22, 2024

AP | ఆ రూట్‌లో అయిదు రోజులపాటు రైళ్ల రాకపోకల బంద్‌.. ఎందుకో తెలుసా?

అరకులోయ, (ప్రభ న్యూస్‌): కొత్తవలస-కిరణ్‌ డోల్‌ సింగిల్‌ రైల్వే లైన్‌ లో ఈనెల 25వ తేది రాత్రి నుండి 30వ తేదీ వరకు పాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ డిసిఎం త్రిపాటి తెలిపారు. కేకే లైన్లో శ్రుంగవరపు కోట.. బొడ్డవర రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న డబల్‌ లైనింగ్‌ పనులు, నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు జరుగుతుండడం వల్ల విశాఖ .. కిరందూల్‌, కిరందోల్‌..విశాఖ ఎక్సెస్ర్‌ రాత్రి రైళ్లతో పాటు, ఉదయం విశాఖ నుండి బయలుదేరే విశాఖ కిరండూల్‌, అలాగే కిరండూల్‌ విశాఖ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ డీసీఎం ఏ త్రిపాటి తెలిపారు.

కాగా ఐదు రోజులు పాటు కేకే లైన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోనుండడంతో ఈ లైన్‌లో అద్భుత ఆహ్లాదకరమైన.. ఆనందభరితమైన ప్రయాణానికి పర్యాటకులు దూరం కాక తప్పదు. వేసవి సెలవుల్లో కేకే లైన్లో ప్రయాణించి మరుపురాని మధురానుభూత స్ముత్రులను నెమరు వేసుకోవాలి అన్న పర్యాటకుల ఆశలకు ఐదు రోజులు పాటు- రైల్వే శాఖ కళ్లెం వేసిందని చెప్పక తప్పదు. ఈ ఐదు రోజులు అరుకు సందర్శించాలనుకునే పర్యాటకులకు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు లోని ప్రయాణించవలసి ఉంటుంది. ఐదు రోజులపాటు రైళ్ల రాకపోకలు కేకే లైన్లో నిలిచిపోవడంతో పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకుంటారో, లేక బస్సులు ప్రైవేట్‌ వాహనాలు ఆశ్రయిస్తారో వారి నిర్ణయానికి వదిలేద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement