Wednesday, November 20, 2024

Train Accident : కొనసాగుతున్న సహాయక చర్యలు..

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగింది. అక్కడ వాల్తేరు రైల్వే డిఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పది మంది ఆర్‌పీఎఫ్‌ బృందాలు, పోలీస్‌, ఆగ్నిమాపక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం కలసి సహాయక చర్యలు వేగవంతం చేస్తుంది. అయితే భారీగా దెబ్బతిన్న రైల్వే బోగీలను బయటకు తీస్తున్నారు. మరో పక్క రైల్వే ట్రాక్‌ పనులు సైతం పునురద్దరణ చేపడుతున్నారు. సాయంత్రం ఐదు గంటల నాటికి రైలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పలు రైళ్లు రద్దు…
విజయనగరం జిల్లా వద్ద జరిగిన రైలు ప్రమాదం కారణంగా విశాఖ వైపు వెళ్లాల్సిన రైళ్లు, భువనేశ్వర్‌ వైపు వెళ్లాల్సిన రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటి వరకూ 27రైళ్లు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలుపుతున్నారు. వీటిలో….

ఆయా స్టేషన్లలో బయల్దేరవలసిన మరో 8 రైళ్లు కూడా రద్దు..
1) భువనేశ్వర్ – విశాఖపట్నం (22819) ఇంటర్ సిటీ express
2) విశాఖపట్నం – భువనేశ్వర్ (22820) ఇంటర్ సిటీ express
3) విశాఖపట్నం – పలాస ( 07470) ప్యాసింజర్
4) పలాస – విశాఖపట్నం (07471) ప్యాసింజర్
5) విశాఖపట్నం – తిరుపతి (08583) వీక్లీ స్పెషల్
6) బ్రహ్మపూర్ – విశాఖపట్నం (18525) ఎక్స్ ప్రెస్
7) విశాఖపట్నం – బ్రహ్మపుర్ (18526) ఎక్స్ ప్రెస్
8) రేపు తిరుపతిలో బయలుదేరవలసిన తిరుపతి – విశాఖపట్నం 08584) వీక్లీ స్పెషల్.

- Advertisement -

కిటకిటలాడుతున్న రైలు, బస్‌ స్టేషన్ …
విజయనగరం జిల్లా రైలు ప్రమాదం కారణంగా ఒక్కసారిగా 27 రైళ్లు రద్దు చేయడంతో ఆయా రైళ్లలో ప్రయాణించాల్సిన ప్రయాణీకులంతా రైల్వే స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన సమాచార కేంద్రానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో రైళ్లు రద్దు చేయడంతో ఆయా ప్రయాణీకులంతా ప్రత్యామ్నాయ వాహనాలు ఏర్పాటుతో పాటు ఆర్టీసీ బస్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో ఆయా ప్రాంతాలన్నీ ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement