Tuesday, November 26, 2024

Vizianagaram: రైలు ప్ర‌మాదం.. 15 మృతదేహాలు వెలికితీత

(విశాఖపట్నం-ఆంధ్రప్రభ బ్యూరో) : విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను పక్కగా సేకరించేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ఘటనలో 15 మంది మృతి చెందినట్టు గుర్తించిన అధికారులు, వారిలో 12 మంది వివరాలను సేకరించారు. అలాగే 60 మంది వరకూ గాయపడినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ తెలిపారు. క్షతగ్రాతులను తక్షణ వైద్యసేవల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. ఇప్పటికే 40 మంది వరకూ విజయనగరం జిల్లాలో చేర్చగా.. పది మంది వరకూ కేజీహెచ్‌కు తరలించినట్టు సమాచారం. అదే విధంగా మృతులను గుర్తించి ఆయా మృతదేహాలను ఆరింటిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో, ఒక మృతదేహాన్ని మిమ్స్‌లో, ఏడు మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అయితే బోగీల కింద ఇంకా మృతదేహాలు ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో వైపు విశాఖ కేజీహెచ్‌కు తరలించిన క్షతగ్రాతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యసేవలందిస్తున్నారు.


మృతుల వివరాలు ఇవే…

  1. గిరిజాల లక్ష్మీ(శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం, పి.రామచంద్రాపురం)
  2. కంచు భారతి రవి(30)—విజయనగరం జిల్లా జామి మండలం జోడుకొమ్మ గ్రామం
  3. చల్లా సతీష్‌(32)– విజయనగరం జిల్లా ప్రదీప్‌ నగర్‌
  4. ఎస్‌హెచ్‌ఎస్‌ రావు– ఉత్తరప్రదేశ్‌, రాయగడ పాసింజర్‌ లోకోపైలట్‌
    5.కరణం అక్కల నాయుడు(45)– విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపు సంబాం గ్రామం
  5. ఎం. శ్రీనివాస్‌, విశాఖ-పాలస రైలు గార్డు
  6. చింతల కృష్ణనాయుడు(35)– విజయనగరం జిల్లా కొత్త వలస
    8.రెడ్డి సీతమ్మనాయుడు-(43)–విజయనగరం జిల్లా చీపురపల్లి రెడ్డిపేట
    9.మజ్జరాము(30)– విజయనగరం గరివిడి మండలం గదబవలస గ్రామం
    10.టెంకల సుగణమ్మ—శ్రీకాకులం జిల్లా జి.సిగడం
  7. పిల్లా నాగరాజు—విజయనగర జిల్లా గరివిడి
    12.గిడిజాల లక్ష్మీ—శ్రీకాకుళంజిల్లా జి.సిగడం

Advertisement

తాజా వార్తలు

Advertisement