అమరావతి – రాబోయే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. వైనాట్ 175 అని సీఎం జగన్ తో సహా ఆ పార్టీ మంత్రులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక సాధికారత పేరుతో బిసి యాత్రలకు శ్రీకారం చుట్టనుంది.. ఎపిలోని అన్ని నియోజకవర్గాలలో ఆయా మంత్రులు,ఎమ్మెల్యే కలసి ఈ యాత్ర చేపట్టనున్నారు.. ఈ యాత్రలో పేదల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం దేశంలో మరే ప్రభుత్వం చేయనంతగా చేస్తున్నామని చెప్పనున్నారు. మరోవైపు సామాజిక సాధికార యాత్ర ట్రైలర్ ను వైసీపీ విడుదల చేసింది. సామాజిక సాధికారత కోసం వీల్స్ ఆఫ్ సోషల్ ఎంపవర్ మెంట్ పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉందని ఎక్స్ వేదికగా వైసీపీ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో సినిమా ట్రైలర్ ను మించి ఉన్నది.. ఎస్సీ, ఎస్టీ,బిసి,మైనార్టీలకు జగన్ ఇప్పటి వరకు చేసిన,అందించిన పథకాల వివరాలను వీడియోలో చూపారు.. విద్యా వ్యవస్థ మార్పును వివరించారు.. ఎపిలో వివిధ వర్గాల కోసం వివిద సంక్షేమ పథకాలను ప్రస్తావించారు.. ఈ వీడియోను మీరూ చూడండి..
Trailer Released – వైసిపి ‘సామాజిక సాధికార యాత్ర’ ట్రైలర్ అదిరింది….
Advertisement
తాజా వార్తలు
Advertisement