చక్కర్లు కొట్టిన యుద్ధ విమానాలు
ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ సక్సెస్
ఎయిర్ క్రాప్ట్, వాయుసేన విమానాల రాక
సింగరాయకొండ, కొరిశపాడు మధ్య ట్రయల్స్
ఆకాశంలో వైమానిక అలజడి
నేషనల్ హైవేపై 5 కిలోమీటర్ల రన్ వే
524 మంది పోలీసులతో బందోబస్తు
(అద్దంకి, ప్రభ న్యూస్) – ఆకాశంలో ఫైటర్ జెట్లు రయ్‌మంటూ దూసుకొచ్చాయి. అంతేకాకుండా వాయుసేనకు చెందిన పలు విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. ఆ చుట్టుపక్కల దాదాపు వందలాది మంది పోలీసులు మోహరించారు. హైవేపై ఏం జరిగింది?.. తీవ్రవాదులు కానీ, మరేదైన ఘాతుకం జరిగిందా? అనే ఆలోచనలతో స్థానికులు అయోమయానికి గురయ్యారు.
ఎమర్జెన్సీ సమయంలో ల్యాండింగ్ కోసం
అత్యవసర సమయంలో.. వైపరీత్యాల క్షణాల్లో విమానాలను సురక్షిత ప్రాంతంలో దించే ప్రక్రియ కోసం చేపట్టిన ట్రయల్ రన్‌ను ఎయిర్‌ఫోర్స్ సక్సెస్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎయిర్ క్రాఫ్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు మండలం పిచికుల గుడిపాడు, సింగరాయకొండ మండలం మధ్య రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్ వే లను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా చేపట్టిన ఈ విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఎస్సీ అధ్వర్యంలో పోలీసుల బందోబస్తు
వాయుసేన, ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు సోమవారం కొరిశపాడు మండలం పిచికుల గుడిపాడు వద్ద జాతీయ రహదారి 16 పై సుమారు 5 కిలోమీటర్ల రహదారిపై ఏర్పాటు చేసిన రన్ వే లో ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ .ట్రయిల్ రన్ కార్యక్రమాన్ని ఒంగోలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో 524 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. ఉదయం నుంచి జాతీయ రహదారి పై వాహనాలను దారి మళ్లించారు.