అదనపు కట్నం కోసం డాక్డర్ తన భార్యను వేధించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో డాక్టర్ సాయి సుధీర్‌ను పోలీసులు విచారణ చేస్తన్నారు. చెడు వ్యసనాలకు బానిసైన డాక్టర్ మద్యం, జూదం అలవాట్లతో రూ.70 లక్షల వరకు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. కాగా, అతడి ప్రవర్తన బాగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ మధ్యనే జాబ్ నుంచి తొలగించినట్టు సమాచారం అందుతోంది.. అటు ఉద్యోగం పోవడం, ఇటు ఖర్చులు పెరగడం.. అప్పుల వారి ఇబ్బందులు తట్టుకోలేక తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది..
ఇక.. విశాఖలోని డాబా గార్డెన్స్‌లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేరళకు చెందిన కృష్ణ అనే యువతి లాడ్జిలో ఉరేసుకుని చనిపోయింది. ఈ యువతి చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్నట్టు తెలుస్తోంది. కాగా, పోలీసులు ఆ యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక.. పెందుర్తి మండలం గోరపల్లిలో విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఓ కుటుంబ ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దంపతులు ఇద్దరూ మృతిచెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. చికిత్స కొనసాగిస్తున్నారు. దీనికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు చెబుతున్నారు.