శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద ఉన్న లంక మిట్ట గిరిజన కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లంక మిట్ట గిరిజన కాలనీలో ప్లాస్టిక్ వస్తువులు సేకరించుకుని బతుకు జీవనం సాగిస్తున్న వయో వృద్ధులు గుడిలో నివసిస్తున్నారు. వయోభారంతో పూర్తిగా లేవలేని స్థితి, మరోవైపు అనారోగ్యంతో బాధపడుతుండటంతో మంచానికే పరిమితమైన పరిస్థితి కావటంతో. మంగళవారం తెల్లవారుజామున తీవ్ర చలికి తట్టుకోలేక గుడిసెలో చలి మంటలు వేసుకోవడంతో గుడిసెలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కూడా అంటుకున్నాయి.
అగ్ని మంటలు చెలరేగి వయోవృద్ధులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనలో 80 ఏళ్ల వెంకటసుబ్బయ్య, 75ఏళ్ల లక్ష్మమ్మ పూర్తిగా సజీవదహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..